02-02-2026 11:25:40 AM
13వ వార్డ్ ఎరుకలి రవి ని ఆదరించి ఆశీర్వదించండి
రాజు గౌడ్, సీతారాం సింగ్
మాదారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నయా జోష్
జిన్నారం/అమీన్ పూర్: హస్తం పేదల నేస్తం అని జిన్నారం మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కాలాల్ రాజు గౌడ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం గడ్డపోతారం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 13 వార్డ్ అంబేద్కర్ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. కాలని లోని సమస్యలు అడిగి తెలుసుకున్నరు. మున్సిపల్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి మాన గ్రామంనికి మూడు కోట్ల ఫండ్ రానుంది ఎన్నికల తరువాత ఒకోటిగా సమస్యలు పూర్తి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు సీతారాం సింగ్ మాట్లాడుతూ... మాదారం అంబేద్కర్ కాలనీ గతంలో గత పాలకుల పాలనలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినప్పుడు నుండి గ్రామం అభివృద్ధి వైపుగా అడుగులు వేస్తుందన్నారు. అనంతరం రాజు గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో ప్రతి వార్డు లో సిసి రోడ్డు, డ్రైనేజీ నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే జరిగిందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన మాటా ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పేద ప్రజలకు ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుందన్నారు. మాదారం గడ్డపైన కాంగ్రెస్ జెండాను ఎగరవేసి కాటా శ్రీనివాస్ గౌడ్ కి కానుకగా ఇద్దామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు రాజేందర్ సింగ్, మంత్రి అశోక్, ఎల్లయ్య, సీతారాం యాదవ్, లక్ష్మణ్ యాదవ్, జగన్, కిషోర్, రాజు, నాగని ప్రభాకర్, వీరేష్, నరసింహ, నర్సింగరావు, వెంకటేష్ గౌడ్, రాజు, బాలు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.