02-02-2026 02:26:21 AM
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): సంక్షేమం+అభివృద్ధి=నేటి బడ్జెట్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. కేంద్ర బడ్జెట్‌పై కేంద్రమంత్రి సంజ య్ కుమార్ ఆదివారం స్పందించారు. ఆర్థిక క్రమశిక్షణతో దేశాన్ని అద్భుతంగా ముం దుకు నడిపించే బడ్జెట్ అని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులకు కేంద్రం పెద్దపీట వేసిందన్నారు. రక్షణ, రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వికసిత్ భారత్ లక్ష్యంగా, వీబీజీ రామ్‌జీకి నిధులు పెంచారన్నారు. ఉచితం కంటే ఉపాధి అవకాశాలు కల్పించడమే బడ్జెట్ లక్ష్యమన్నారు. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి, నవభారత యువత భవిష్యత్‌కు పెట్టుబడి ఈ బడ్జెట్ అని ఆయన తెలిపారు.