2 April, 2026 | 11:19 PM

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

01-12-2024 06:48 PM

రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ ఎస్సీ కాలనీ 1వ వార్డులో ఆదివారం రోజు శ్రీమతి బైరం దుర్గమ్మ భర్త నర్సింలుకు ముఖ్యమంత్రి సహయనిధి నుండి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కార్యదర్శి కుమార్.బొట్ల బాబు, భాస్కర్, బైరం శంకర్, కుందేన రాములు, బైరం రాజు, సంతోష్ ల ఆధ్వర్యంలో చెక్కు అందించడం జరిగినది. బాధితులకు ముఖ్యమంత్రి సహయనిధి నుండి సహాయం అందిచడం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రబాత రావుకి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ కి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యెసుగారి రమేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల నాయకులకు కార్యకర్తలకు వారు కృతజ్ఞతలు తెలిపారు.