14 July, 2026 | 6:51 PM

Breaking News

విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •  

ఘనంగా పోలీసు కిష్టయ్య వర్ధంతి వేడుకలు..

01-12-2024 06:54 PM

మెదక్: రామాయంపేట పట్టణంలో పోలీసు కిష్టయ్య వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామాయంపేట సీఐ.వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మన తెలంగాణ ప్రాంతంలో చాలామంది అమరులు కావడం జరిగిందన్నారు. అందులో మలిదశ ఉద్యమంలో పోలీస్ శాఖ తరపున తొలిసారి పోలీసు కిష్టయ్య తన ప్రాణాలు బలిదానం చేసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం స్వరాష్ట్రం కోసం పోలీసు కిష్టయ్య ప్రాణాలర్పించడం గొప్ప విషయం, ఆయన సేవలు మరువలేనివని అన్నారు. తొలిదశ ఉద్యమంలో కూడా చాలామంది అమరులైన వారికి ఆయన నివాళులర్పిస్తూ జోహార్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట రాజాగౌడ్, ప్రజాసంఘాల నాయకులు ముదిరాజ్ నాయకులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.