calender_icon.png 14 June, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖబర్దార్ పుట్ట మధు నోరు అదుపులో పెట్టుకో

13-06-2025 08:44:51 PM

మంథని,(విజయక్రాంతి): ఖబర్దార్ పుట్ట మధు నోరు అదుపులో పెట్టుకో అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ హెచ్చరించారు. ఐంది ప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ వోడ్నాల శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, నాయకులు శశిభూషణ్ కాచే,మాజీ యూత్ అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, మాజీ ఎంపిటిసి మారగొని శంకర్ గౌడ్, శ్రీపతి బానయ్య, అజీమ్ ఖాన్, నర్సింగరావు మాట్లాడుతూ... మాజీ జెడ్పీ చైర్మన్ పుట్ట మధు చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.

మంథని నియోజకవర్గాన్ని మంత్రి సర్వతోముఖాభివృద్ధి చేస్తా ఉంటే చూసి ఓర్వలేక ఆయన ఆరోపణలు చేస్తా ఉన్నారని శ్రీను బాబుకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ ప్రాంత ప్రజల కష్టాలను తీరుస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక్క ఫోన్ తోటే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి వారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా వారికి అవకాశం ఇచ్చారని, ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిపైన కూడా నువ్వు రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. నీ సతీమణి పుట్ట శైలజ మంథని సర్పంచ్ గా, నువ్వు మంథని ఎమ్మెల్యేగా నీ భార్య శైలజ మున్సిపల్ చైర్మన్ గా నువ్వు జడ్పీ చైర్మన్ గా ఉన్నారని మర్చిపోయారా... ఆనాడు మంథని సర్పంచ్ గా మున్సిపల్ చైర్మన్ గా ఇతర ఎస్సీ ఎస్టీ బీసీకి ఎందుకు పదవులు ఇవ్వలేదని మధు ను ప్రశ్నించారు. 

ఆనాడు కాళేశ్వరం ముక్తేశ్వర దేవాలయ చైర్మన్ గా ఓసి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇవ్వడం జరిగిందని, స్థానికేతరుడు కేసీఆర్ చుట్టానికి కాలేశ్వరం ముక్తేశ్వర దేవస్తాన చైర్మన్ ఇస్తే ఆనాడు నువ్వెందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. ఇక్కడున్న  ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎందుకు కాలేశ్వరం ముక్తేశ్వర దేవస్థానం చైర్మన్ పదవి ఇప్పించలేదని  నిలదీశారు. ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ బీసీలను అణగదొక్కి వారిపై దాడులు చేసి  ఈరోజు నువ్వు ఈ స్థాయికి వచ్చావని, నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, ఈ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్ని వర్గాల ప్రజలకు నాయకులకు సముచిత స్థానం కల్పిస్తున్నారని, ఇది పూర్తిగా మా పార్టీ వ్యవహారమని, ముందు నీ పార్టీ కార్యకర్తలు నీ నాయకత్వం నచ్చక శ్రీధర్ బాబు  నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని, ముందు నీ పార్టీ వ్యవహారాలు చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. మరోసారి మంత్రి శ్రీధర్ బాబు ౠశ్రీను బాబు గురించి మాట్లాడితే మా కాంగ్రెస్ నాయకులు  ఊరుకోరని హెచ్చరించారు.