4 July, 2026 | 9:56 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

హనుమకొండ కలెక్టర్‌గా స్నేహ శబరీష్‌

13-06-2025 08:50 PM

హనుమకొండ(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్ గా పనిచేస్తున్న స్నేహ శబరీష్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లాకు మూడోసారి మహిళా కలెక్టర్. 2017 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు. 1994లో చెన్నైలో జన్మించారు అక్కడే స్టెల్లా మారిస్ కళాశాలలో బీఎ పూర్తి చేశారు. ఆమె భర్త శబరిష్ కుమార్ ప్రస్తుతం ములుగు జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మొదటగా రంగారెడ్డి జిల్లా సహాయ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. అనంతరం 2020లో ఆసిఫాబాద్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. 2024లో గ్రేటర్ హైదరాబాద్ అదనపు కమిషనర్ గా నియమితులయ్యారు. ఉత్తమ పనితీరుతో పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత కలెక్టర్ పి.ప్రావిణ్య సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. తన పనితీరుతో ప్రజల మన్నలను అందుకున్నారు.