calender_icon.png 19 December, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడికి సన్మానం

19-12-2025 05:44:06 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యపేట జిల్లా మఠంపల్లి మండలంలో గ్రామ పంచాయతీలకు నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు శుక్రవారం మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూక్యా మంజీ నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మీ మీద నమ్మకంతో గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని, ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధే ద్యేయంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సూర్య పేట జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధరవతు నవిన్ నాయక్, వివిధ గ్రామాల సర్పంచ్లు,వార్డు సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు