calender_icon.png 19 December, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు

19-12-2025 05:46:45 PM

హనుమకొండ,(విజయక్రాంతి): కెయూసి పోలీస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తాళం వేసి వున్న ఇండ్లల్లో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని  కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసారు. అరెస్టు చేసిన నిందితుడి నుండి పోలీసులు సూమారు ఐదు లక్షల విలువ గల 40 గ్రాముల బంగారు అభరణాల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత వివరాలను వెల్లడిస్తూ ఆసిఫాబాద్‌ జిల్లా తాండుర్‌ మండలం, రేచిని గ్రామం, ప్రస్తుతం హనుమకొండ పరిధిలో నివాసం వుంటున్న సబ్బాని రంజిత్‌ (24), తాండూర్‌ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడి పనిచేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ జల్సాలకు చేయడంతో తనకు వచ్చే అదాయం తన జల్సాలకు సరిపోకపోవడంతో నిందితుడు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు.

ఇందు కోసం నిందితుడు 2020 సంవత్సరంలో మంచిర్యాల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోరీకి పాల్పడటంతో నిందితుడుని పోలీసులు అరెస్టు చేసిన జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన నిందితుడు తమ కుటుంబంతో కల్సి గత మూడు సంవత్సరాలు  కెయూసి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ నివాసం వుంటున్నాడు.  ఈ నెల 12వ తారీఖున నిందితుడు నివాసం వుంటున్న  పరిసరాల్లో   నివాసం వుంటున్న దంపతులు ఇంటికి తాళం వేసి సినిమాకి పోయినట్లుగా గుర్తించిన నిందితుడు. ఎవరికి అనుమానం రాకుండా నిందితుడు ఆ ఇంటి తాళం పగులగొట్టి బీరువాలోని 40గ్రాముల  బంగారు అభరణాలతో పాటు 40వేల రూపాయల నగదు, ఒక సెలఫోన్‌ చోరీ చేసి అక్కడి నుండి తప్పించుకొని పారిపోయాడు. తమ ఇంటిలో దొంగలు పడినట్లుగా గుర్తించిన బాధితులు తమ ఫిర్యాదులు మాత్రం ఇంటిలో 250 గ్రాముల బంగారు అభరణాలు చోరీ జరిగినట్లుగా ఫిర్యాదు ఇవ్వడంతో  వేగంగా పోలీసులు క్రైమ్స్‌ అదనపు డిసపి బాలస్వామి అదేశాల మేరకు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులకు అందుబాటులో వున్న టెక్నాలజీని వినియోగించు కోని నిందితుడి కదలికలపై నిఘా పెట్టారు. ఈ రోజు ఉదయం కెయూసి, సిసిఎస్‌ పోలీసులు సంయుక్తంగా కలసి కెయూ జంక్షన్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఇదే ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోని తనిఖీ చేయగా తాను చోరీ చేసిన బంగారు గాజులు గుర్తించిన పోలీసులు నిందితుడుని విచారించగా తాను చోరీ చేసిన ఇంటిలో కేవలం నాలుగు బంగారు గాజులు, 40 వేల రూపాయల నగదు, ఒక సెల్‌ఫోన్‌ మాత్రమే చోరీ చేసినట్లుగా పోలీసుల ఎదుట అంగీకరించాడు. దీనితో బాధితుల ఇంటిలో కేవలం 40 గ్రాముల బంగారు అభరణాలు మాత్రమే చోరీ జరిగినట్లు గుర్తించిన పోలీసులు బాధితుల ఇంటిలో మరో మారు తనీఖీ చేయగా చోరీ అయింది అనుకుంన్నా మిగితా బంగారు అభరణాలు బాధితుల ఇంటిలోనే లభ్యం కావడం జరిగింది.

ఈ చోరీ సంఘటన సంబంధించి సెంట్రల్‌ జోన్‌ డిసిపి మాట్లాడుతూ ఇకపై ఎవరైన బాధితులు ఎవరైన చోరీ గురైన సొమ్ము ఎక్కువ మొత్తంలో చోరీ జరిగినట్లు  ఫిర్యాదు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొవడం జరుగుతుందని డిసిపి ప్రజలకు సూచించారు. నిందితుడుని పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన సిసిఎస్‌, కెయూసి ఇన్స్‌స్పెక్టర్లు రాఘవేందర్‌,ఎస్. రవికుమార్‌,ఫింగర్‌ ప్రింట్‌ విభాగం ఇన్స్‌స్పెక్టర్‌ దేవేందర్‌, కెయూసి ఎస్‌.ఐ శ్రీకాంత్‌, కిరణ్‌, ఏఏఓ సల్మాన్‌పాషా, హెడ్‌ కానిస్టేబుళ్ళు మహేశ్వర్‌, జంపయ్య, కానిస్టేబుళ్ళు మధుకర్‌, చంద్రశేకర్‌,వంశీ,విశ్వేశ్వర్‌,ఐటీ కోర్ కానిస్టేబుళ్ళు నగేష్, ప్రవీణ్ లను సెంట్రల్‌ జోన్‌ డిసిపి అభినందనలు తెలియజేసారు.