20-12-2025 01:14:06 AM
నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు మండల అధ్యక్షులు గంగాధర్ శుభాకాంక్షలు
బిచ్కుంద, డిసెంబర్ 19 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో నూతనంగా గెలిచిన సర్పంచ్ లకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా గెలిచిన సర్పంచులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు, ఆయా గ్రామాల అభివృద్ధి కొరకు కృషి చేయాలని పేర్కొన్నారు. నూతన సర్పంచులు ఎప్పటికీ గ్రామాలలో అందుబాటులో ఉండి గ్రామ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో నిధులు తీసుకువచ్చి పార్టీలకు అతీతంగా పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామపంచాయతీలను ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలన్నారు.