calender_icon.png 20 December, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ ఎత్తివేయడానికే కుట్ర

20-12-2025 01:15:21 AM

బూర్గంపాడు,డిసెంబర్19(విజయక్రాంతి):పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చ ట్టాన్ని ఎత్తివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు.

శుక్రవారం బూర్గంపాడు మండలం పాండవుల బస్తీలో ఉపాధి కార్మికులతో జి-రామ్-జీ పత్రాన్ని తగులబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్రం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజివిక మిషన్ పేరుతో బిల్లును తీసుకు వస్తు న్నారన్నారు.

పథకాన్ని నీరుగార్చే ఉద్దేశంలో భాగంగానే ఈ బిల్లును తీసుకొస్తున్నారని ఆరోపించారు. 2014నుంచి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ క్రమంగా ఈ ప థకాన్ని నీరుగారుస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బోయిన ఆదెమ్మ, బర్ల మాణిక్యం,గుమ్మడి గోవిందమ్మ, పుట్టి నాంచారమ్మ,పుట్టి చిట్టెమ్మ,నాని,లక్ష్మి, బర్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.