calender_icon.png 16 December, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం మీద ఏడవడమే కాంగ్రెస్ పాలసీ

03-12-2025 12:00:00 AM

  1. ఆ పార్టీని తెలంగాణ సమాజమే భూస్థాపితం చేస్తుంది

ఫ్యూచర్ సిటీని ఎవరిని అడిగి కడుతున్నారు..?

కేంద్రం ఇప్పటి వరకు ఏ సిటీకి నిధులు ఆపలేదు

రేవంత్‌రెడ్డి హిందువు అని మర్చిపోయిండా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు  

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): ఫ్యూచర్ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు, ఎలా ఇవ్వాలో కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? సిటీ ప్లానింగ్ మొత్తం రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోనిదని, కేవలం కేంద్రం  మీద ఏడవడమే కాంగ్రెస్ పాలసీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపడ్డారు. అమృత్ స్కీం, స్మార్ట్ సిటీ, స్వచ్ఛ భారత్.. ఇలా అనేక పథకాలకు కేంద్రం ఏనాడు ని ధులు ఆపలేదని తెలిపారు. 

ఫ్యూచర్ సిటీకి కేంద్రం నిధులివ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ చీఫ్ తెలిపారు.  తెలంగాణ సమాజమే కాంగ్రెస్ సర్కార్‌ను భూస్థాపితం చేస్తుందని, ఫ్యూచర్ సిటీ ఎవరిని అడిగి కడుతున్నారని ఆయన నిలదీశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎనిమిది జిల్లాల అధ్యక్షులు, కార్పొరే టర్లు, ప్రధాన కార్యదర్శులతో ఆయన మం గళవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయ న మీడియాతో మాట్లాడారు. 

సీఎం రేవంత్‌రెడ్డి ముస్లింగా మారాడా?

‘రేవంత్ రెడ్డి మూడు రోజులుగా కాంట్రవర్సీ మాట్లాడుతున్నారు, ఫ్రస్టేషన్‌లో మా ట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.. దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.. హిందువులపై ఇంత మాట్లాడుతున్న ఓవైసీపై రేవంత్ రెడ్డి ఏమాత్రం స్పందించడంలేదు.. రేవంత్ రెడ్డి ముస్లింగా మారాడా అన్న అనుమానం కలిగింది’ అని  ఎన్.రాంచందర్ రావు చెప్పరు. సీఎం హనుమంతుడు పేరు తీసుకునే అవసరం ఏముందని  ప్రశ్నించారు.

మజ్లీస్‌తో సహవాసం చేసి హిందువు అని మర్చిపోయినట్లున్నాడని, గతంలో హిందుగాళ్లు, బొందు గాళ్లు అని కేసీఆర్ విమర్శలు చేశారని, కాంగ్రెస్ అంటేనే ముస్లిం, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అయి ఉండొచ్చన్నారు. కానీ, బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ పెద్ద హిందూ వ్యతిరే కిగా తయారవుతోందని  ధ్వజమెత్తారు.

విచారణకు హాజరుకావాలి

నేషనల్ హెరాల్డ్ భూముల లెక్కలు ఎవరికీ తెలియదని, సుప్రీం కోర్టు తీర్పు ద్వారా నే ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చిందని తెలిపారు.  ముందు నేషనల్ హెరాల్డ్ కేసు లో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. బీజేపీ అంటే భయం పట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా అబద్ధపు ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చేస్తోందని మండిపడ్డారు.  నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, సోని యా గాంధీపై బీజేపీ అక్రమ కేసులు పెట్టారని తప్పడు ప్రచారం చేస్తున్నారని, ఈ వ్యా ఖ్యలను ఖండిస్తున్నామన్నారు.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి

విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు?, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదు? ఆరో గ్యశ్రీ బకాయిలు ఎందుకు విడుదల చేయ డం లేదు?, రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదు? గ్రామాల అభివృద్ధిపై ఎం దుకు శ్రద్ధ చూపడం లేదో...ముందుగా రేవంత్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

‘సంచార్ సాథీ’పై తప్పుడు ప్రచారం 

భారత ప్రభుత్వం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ విషయం లో, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతుంటాయని, తీసుకొచ్చే ఏ పథకం, ఏ యాప్ అ యినా ప్రజాసంక్షేమం, భద్రత కోసం మా త్రమే ఉంటుందని తెలిపారు.  సుప్రీంకోర్టు ఈ యాప్‌పై మానిటరింగ్ చేసింది, ట్రాకింగ్ కూడా జరిగిందని, ఇటువంటి అంశంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని ఖండిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంత మండలం నార్కట్‌పల్లికి చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరారు.   

కాంగ్రెస్ రెండేళ్ల పాలన అట్టర్ ఫ్లాప్

రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో చేసిందేమీ లేదని రాంచందర్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి పెరిగిపోయిందని, గత బీఆర్‌ఎస్ సర్కారు లాగానే ఫెయిల్యూర్ పాలన అయ్యిందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన మొత్తం ఫ్లాప్ అయ్యిందని,  హెల్త్, ఎడ్యుకేషన్, డెవలప్ మెంట్.. ఇలా అన్నింటిలో విఫలమయ్యిందన్నారు.

అందుకే రేవంత్ రెడ్డి సర్కారును ప్రజలు భూస్థాపితం చేయబో తున్నారని విమర్శించారు. ఈనెల 7న మహాధర్నాకు ఎనిమిది జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. మహాధర్నా తరువాత దీనిపై భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.