02-12-2025 10:51:29 PM
కాచిగూడలోని వాల్మీకినగర్ లో రూ. 4.50 లక్షలతో తాగునీటి పైప్లైన్ నిర్మాణం పనులు ప్రారంభం..
అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్
ముషీరాబాద్ (విజయక్రాంతి): నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు మంగళవారం కాచిగూడ డివిజన్ వాల్మీకి నగర్ లో రూ. 4.50 లక్షల వ్యయంతో మంచినీటి పైప్ లైన్ నిర్మాణపు పనులను కాచిగూడ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్ యాదవ్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటివరకు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలను వెచ్చించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే కాచిగూడ డివిజన్ లోని వాల్మీకి నగర్ లో రూ. 4.50 లక్షలతో మంచినీటి పైప్లైన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పైప్ లైన్ నిర్మాణం పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం కృష్ణ, ఏఈ సూర్య, డివిజన్ అధ్యక్షులు భీష్మ దేవ్, బీఆర్‌ఎస్ నాయకులు ఓం ప్రకాష్ యాదవ్, దాత్రిక్ నాగేందర్ బాబ్జి, సునీల్, బబ్లు సింగ్, ఆంటో, రమేష్, రాజేష్, సుభాష్, పటేల్, శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.