calender_icon.png 27 December, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పథకం నిర్వీర్యం

27-12-2025 10:26:06 AM

గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ ఆందోళన

పేర్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర

హైదరాబాద్: నెహ్రూ, ఇందిరా గాంధీ, మహాత్మ గాంధీల పేర్లు లేకుండా చేయాలని బీజేపీ(Bharatiya Janata Party), కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా నిరసనగా హుస్నాబాద్ లో గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది.

మంత్రి పొన్నం ఆధ్వర్యంలో కాంగ్రెస్(Congress) శ్రేణులు నిరసన చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం పేరు మార్చడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ధర్నాకు దిగింది. గ్రామీణ ప్రజల కోసం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం(Manmohan Singh) ఉపాధిహామీ పథకాన్ని తెచ్చిందని పొన్నం సూచించారు. పట్టణ ప్రాంతాలకూ ఉపాధిహామీ తీసుకొస్తామని ఎన్డీఏ చెప్పింది.. ఇప్పుడేమో ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. గాంధీని అవమానిస్తూ పథకంలోనుంచి ఆయన పేరును తొలగించారని తెలిపారు.