27-12-2025 11:32:07 AM
మందమర్రి జీఎం ఎన్ రాధాకృష్ణ
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మందమర్రి పట్టణంలోని పాలవాగు అటవీ ప్రాంతంలో జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు సమ్మక్క- సారక్క జాతరను వైభవంగా జరుపుకోవాలని మందమర్రి జీఎం ఎన్ రాధకృష్ణ అన్నారు. జాతర నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు సింగరేణి చేస్తుందన్నారు. జీఎం కార్యాలయంలో జీఎం రాధాకృష్ణ తన చాంబర్లో సమ్మక్క సారక్కల జాతర ఏర్పాట్ల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘం నాయకులు, అన్ని డిపార్టుమెంట్ల అధికారులు సమన్వయంతో జాతర నిర్వహణకు కృషి చేయాలన్నారు. ఇప్పటి నుంచే జాతర నిర్వహణ కోసం చేపట్టాల్సిన పనుల గురించి అధికారులు ప్లాన్ చేసుకోవాలన్నారు. సమ్మక్క సారక్క గద్దెల వద్ద చేపట్టాల్సిన పనుల ఏర్పాట్ల పై చర్చించారు. జాతర వద్ద భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్లు, మంచి నీటి వసతులతో పాటు, విద్యుత్ దీపాల ఏర్పాట్లపై కూడ దృష్టి పెట్టాలన్నారు. జాతరకు భక్తులు వెళ్లేందుకు వీలుగా సౌకర్యవంతమైన తాత్కాలిక రోడ్లను కూడ ఏర్పాటు చేయాలన్నారు. మేడారం జాతరను తలపించే విధంగా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు. యూనియన్ ప్రతినిధులు తగిన సహకారం అందించాలని కోరారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భూ శంకరయ్య, కేకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ మల్లయ్య, డీజీఎం ఈ అండ్ ఎం వర్క్ షాప్ దూప్ సింగ్, ఇన్చార్జి పర్సనల్ మేనేజర్ ఎం.డి ఆసిఫ్, సివిల్ ఎస్ ఇ శ్రీధర్, ఏరియా సర్వే ఆఫీసర్ దేశాయ్, బెల్లంపల్లి బ్రాంచ్ ఏఐటీయూసీ సెక్రటరీ దాగం మల్లేష్, రామకృష్ణాపూర్ బ్రాంచ్ సెక్రటరీ అక్బర్ అలీ, ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఏఐటీయూ సీ జిఎం స్ట్రక్చర్ కమిటీ మెంబర్ సి.వి రమణ, మందమర్రి ఏరియా ఉన్నతాధికారులు, అన్ని గనుల సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.