27-12-2025 12:27:47 PM
హైదరాబాద్: నటుడు శివాజీ(Actor Sivaji) బుద్ధ భవన్ లోని రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళలను కించపరిచేలా మాట్లాడారని ఇటీవల శివాజీకి నోటీసులు అందాయి. తన రాబోయే చిత్రం 'దండోరా' ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో శివాజీ మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళలపై వ్యాఖ్యల నోటీసుపై మహిళా కమిషన్ కు శివాజీ వివరణ ఇవ్వనున్నారు. ఆ కార్యక్రమంలో తాను బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేటప్పుడు మహిళలు సరైన దుస్తులు ధరించాలని సూచించాలనుకున్నానని శివాజీ వివరించారు. తన ప్రసంగంలో తాను రెండు అభ్యంతరకరమైన పదాలను ఉపయోగించినట్లు ఆయన అంగీకరించారు. వాటికి గాను ఆయన తర్వాత క్షమాపణలు చెప్పారు.