calender_icon.png 27 December, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీనామాపై దానం ఆసక్తికర వ్యాఖ్యలు

27-12-2025 12:06:13 PM

ఉపఎన్నిక వస్తే.. మళ్లీ గెలుస్తా: దానం

హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(MLA Danam Nagender) రాజీనామాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేయటంపై దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. రాజీనామా చేయడానికి నా ధైర్యం.. కార్యకర్తలే అన్నారు. కార్యకర్తల అండతోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని దానం పేర్కొన్నారు. ఉపఎన్నిక వస్తే.. మళ్లీ గెలుస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం స్పష్టం చేశారు. సీఎం పదవికి గౌరవం ఇవ్వడం మరిచింది బీఆర్ఎస్ నేతలే, సీఎం ను ఏకవచనంతో అగౌరవంగా మాట్లాడింది బీఆర్ఎస్ వాళ్లే అన్నారు. విమర్శలు చేస్తే.. ప్రతి విమర్శలూ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తలతో సమావేశమైన దానం ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాజీనామా, ఉపఎన్నికల్లో పోటీ అంశాలపై కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.