calender_icon.png 27 December, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చిపోయిన ఏటీఎం దొంగలు

27-12-2025 11:54:17 AM

హైదరాబాద్: ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. నిజామాబాద్(Nizamabad) నగరంలో ఆర్యానగర్, సాయినగర్ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని భారీ చోరీ జరిగింది. ఐదుగురు సభ్యుల ముఠాగా భావిస్తున్న దొంగలు గ్యాస్ కట్టర్ ఉపయోగించి ఏటీఎంలను పగలగొట్టి నగదు దోచుకున్నారు.  సాయినగర్ లోని ఎస్‌బిఐ ఏటీఎంలో సుమారు రూ.10 లక్షలు, ఆర్యానగర్‌లోని డీసీబీ ఏటీఎంలో రూ. 27 లక్షల భారీ మొత్తాన్ని దొంగిలించారు. ఏటీఎం లోపలికి ప్రవేశించేందుకు ఉపయోగించిన గ్యాస్ కట్టర్ వేడికి కొంత కరెన్సీ కాలిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర రెండు నేర స్థలాలను పరిశీలించారు.