22 July, 2026 | 3:04 PM

నీట్ లీక్‌, రాహుల్, ప్రియాంకల అరెస్టు పట్ల కాంగ్రెస్ నిరసన

22-07-2026 01:56 PM

మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ చిత్రపటాల దహనం

గజ్వేల్, జూలై 22: లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీని నిర్బంధించడాన్ని ఖండిస్తూ, నీట్  ప్రశ్నాపత్రం లీక్(NEET paper leak) ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్‌లో కాంగ్రెస్ పార్టీ(Congress protests) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. 

ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టి, ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చిత్రపటాలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తుంకుంట ఆంక్ష రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో  గజ్వేల్ ఏఎంసి చైర్మన్ నరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.