23 July, 2026 | 1:51 AM

ఢిల్లీలో అగ్రనేతల అరెస్టును ఖండిస్తూ హుస్నాబాద్‌లో కాంగ్రెస్ ధర్నా

23-07-2026 12:16 AM

హుస్నాబాద్, జూలై 22: ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ను నిరసిస్తూ శాంతియుత ధర్నా నిర్వహించిన లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీల అరెస్టులను ఖండిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బుధవారం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్లో చర్చ జరపాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్కు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.