23 July, 2026 | 1:50 AM

కళాశాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సు

23-07-2026 12:17 AM

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విద్యార్థుల కృతజ్ఞతలు

కోహెడ, జూలై 22: కోహెడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం.. ఆర్టీసీ బస్సు ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సముద్రాల మోడల్ స్కూల్ విద్యార్థులను పాఠశాల కు తలలించే బస్సు ను.. నాగ సముద్రాల మోడల్ స్కూల్ నుంచి ఉదయం 9.30 గం. లకు బస్వాపూర్, గుండారెడ్డి పల్లి, తంగాళ్లపల్లి మీదుగా కోహెడలో ఉన్న కళాశాల వరకు బస్సు సౌకర్యం కల్పించాలని మంత్రి పొన్నం కు వినతి పత్రాన్ని అందించినట్లు పేర్కొన్నారు.

దింతో మంత్రి స్పందించి విద్యార్థులకు బస్సు ను ఏర్పాటు చేయాలని హుస్నాబాద్ డిపో మేనేజర్ వెంకన్న ను ఆదేశించటంతో మేనేజర్ స్పందించి విద్యార్థులకు బస్సు ను ఏర్పాటు చేశారాన్నారు. కాగా కళాశాల వరకు బస్సు రావడం తో కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. గుండారెడ్డిపల్లి, తంగళ్లపల్లికి చెందిన 32 మంది కళాశాల విద్యార్థులు బస్సు ను సద్వినియోగం చేసుకొనున్నారు.