calender_icon.png 15 December, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పైచేయి

15-12-2025 08:14:12 AM

హైదరాబాద్: తెలంగాణ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ(Telangana Panchayat elections) కాంగ్రెస్ మద్దతుదారులు(Congress Supporters) విజయం సాధించారు. 4,333 స్థానాల్లో సగానికి కంటే ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. రెండో విడత ఎన్నికల్లో 1,188 స్థానాల్లో బీఆర్ఎస్, 624 స్థానాల్లో ఇతరులు, 268 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. సిద్దిపేట, కుమురం భీం, జనగామ, నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది.

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 85.86 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో నమోదైన 84.28 శాతం పోలింగ్ కన్నా 1.58 శాతం ఎక్కువ. యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యధికంగా 91.72 శాతం పోలింగ్ నమోదు కాగా,  నిజామాబాద్ లో అత్యల్పంగా 76.71 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో 4,333 సర్పంచ్, 38,350 వార్డు సభ్యులు ఎన్నికయ్యారు. రెండో దశలో 415 గ్రామ సర్పంచి, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవం అయ్యాయి.