15 April, 2026 | 12:27 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

బతుకంటే ప్రవాహం

23-02-2026 02:28 AM

జీవనం ఎప్పుడూ

వొంపేసుకున్న ద్రావణం కాదు

మళ్లీ మళ్లీ బతుకు బొచ్చెలోకి 

ఎత్తుకోవటానికి

ప్రతి బతుకుకి

కొన్ని పరిమితులుంటాయి

కొన్ని స్వేచ్ఛలుంటాయి

కొన్ని హద్దులుంటాయి

అవి లేకుంటే అది బతుకే కాదు

ప్రతి మనిషికీ 

కొన్ని రహస్యాలూ అవసరమే

జీవితమంతా..

తెరిచిన పుస్తకమేమీ కాదు

ఆసాంతం చదివేయటానికి

కొన్ని పుటల్ని గుర్తుకోసం

మడత పెట్టుకోవాలి !

కొన్ని కాగితాల్ని మన కోసం

దాచి పెట్టుకోవాలి అది అంతే..

అవి మనల్ని అప్పుడప్పుడూ

అద్దంలో దిగంబరంగా

చూపిస్తూ హెచ్చరిస్తూ వుంటాయి

మనకు మనమే

సమాధానం చెప్పుకుంటాం గనుక

మనో నిబ్బరంగా వుండిపోతాం..

మన రహస్యం మన 

గుప్పిట్లోనే వుంటుంది గనుక

ఆ అవిటి తనాన్ని పదేపదే 

జయిస్తూ వుంటాం..

ఏ మనిషైన జీవితాన్ని 

సంపూర్ణంగా సహజంగా

వొంపుకున్నడంటే అది నిజమై 

వుండకపోవచ్చు

నిజాన్ని నిండుగా ఆవిష్కరించుకుంటే

వెగటుతనం

పరిపరి విధాలా వెక్కిరిస్తూనే వుంటుంది

నిర్లజ్జగా అంతా వొంపుకోవటం

వెకిలితనమో వెర్రిబాగులతనమో 

అవుతుంది

జీవితమంటే..

నాలుగోడల మధ్య 

సాఫీగా బతికెయ్యడం కాదు

నువ్వే ప్రపంచమైన వారికి

ఓ కొత్త ప్రపంచాన్ని చూపించటం

చెలిమి దారంతో 

ప్రేమబంధాల్ని పేనుకోవటం

గుండెనిబ్బరంతో 

నిన్నంటి పెట్టుకున్న బతుకు బోగీలను

సమున్నత గమ్యానికి చేర్చటం

సుఖ దుఃఖాలతోసుదూర తీరాలకు 

జీవనదిలా ప్రవహించటం !!

 డాక్టర్ కటుకోఝ్వల రమేష్