calender_icon.png 14 February, 2026 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులివెందుల వైఎస్సార్‌కు ఎంతో మునుగోడు నాకూ అంతే..

14-02-2026 12:56:10 AM

మునుగోడు ప్రజలే నా బలం

ఎమ్మెల్యే రాజ గోపాల్‌రెడ్డి భావోద్వేగ వ్యాఖ్య

గత ప్రభుత్వంలా భూకబ్జాలు, పంచాయతీలు చెయ్యం

మునుగోడులో కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ

చండూరు, ఫిబ్రవరి 13: కడప వైయస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందుల ఎలా ఉందో, మునుగోడులో తనకు అదే అనుబంధం ఉందని  మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావోద్వేగా వాక్య చేశారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపాలి టీలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో చండూరులో ఘన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.

చండూరు పట్టణాన్ని రాబోయే మూడు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీపై, అభ్యర్థులపై నమ్మకం ఉంచి గెలిపించిన ప్రతి ఓటరికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో గెలిచిన వారిలా భూకబ్జాలు, పంచాయతీలు చేయబోమని స్పష్టం చేశారు. చండూరు ప్రజలను కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామని, గెలిచిన ఏడుగురు వార్డు కౌన్సిలర్ల తరఫున ఎవరికైనా కష్టం వచ్చినా అండగా ఉంటామని తెలిపారు. మునుగోడు ప్రజలు తలదించుకునే పని ప్రాణం పోయినా చేయనని స్పష్టం చేశారు.

యువత మద్యానికి బానిసవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ, వారిని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇళ్లులేని పేదవారికి ప్రభుత్వ భూమిని గుర్తించి ప్రతి వార్డుకు 50 మంది చొప్పున ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు.  తదుప ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ... రాజ్‌గోపాల్‌రెడ్డి మార్గదర్శక త్వంలో సిపిఐకాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయని తెలిపారు. చండూరు మున్సిపాలిటీని సిపిఐకాంగ్రెస్ మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయని చెప్పారు. రాజ్ గోపాల్ రెడ్డి ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచే నాయకుడని కొనియాడారు.

కాంగ్రెస్‌సిపిఐ ఐక్యంగా కొనసాగితే నియోజకవర్గంలో తిరుగులేదని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో  డిసిసిబి మాజీ చైర్మన్   కుంభం శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కొరిమి ఓంకారం, కాంగ్రెస్ పార్టీ  నాయకులుకోడి గిరిబాబు, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కోడి శ్రీనివాసులు, కోడి వెంకన్న, బుషిపాక వాసు, కటకం రమేష్, జెల్ల ధనమ్మ, భూతరాజు దశరథ,కలిమికొండ పారిజాత, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉన్నారు.