calender_icon.png 14 February, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండ అంటేనే కాంగ్రెస్

14-02-2026 12:58:37 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో సత్తా చాటాం

బీఆర్‌ఎస్ ఓటమి ఒప్పుకొని.. ఆత్మ విమర్శ చేసుకోవాలి

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 13: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ విజయం సాధించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తదుపరి శుక్రవారం నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ను హైదరాబాదుకు దీటుగా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.

గెలుపొందిన అభ్యర్థులంతా అభివృద్ధి కోసం కృషి చేయాలని తెలిపారు ఎన్నికలలో గెలుపోటములు సహజమని అన్నారు ఓడిపోయిన అధైర్య పడకుండా డివిజన్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు*నల్లగొండ అంటే కాంగ్రెస్ అని...కాంగ్రెస్ అంటే నల్లగొండ అని ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు మేయర్,డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు.

వారానికి రెండు రోజులు నల్లగొండలోనే ఉండి పేదోళ్ల కష్టాలు, సమస్యలు నిర్వహిస్తానని పేర్కొన్నారు.ఇకనుంచి ప్రతి డివిజన్లో ప్రజా దర్బారు నిర్వహిస్తానని వెల్లడించారుఈ సందర్భంగా గెలుపొందిన పార్టీ అభ్యర్థులందరికీ విషెస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి పాశం రామ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్,కార్పొరేటర్లు ఇటికాల మంగమ్మ శ్రీనివాస్, మారగొని నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.