calender_icon.png 29 September, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుంది

29-09-2025 12:00:00 AM

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్ క్రైం, సెప్టెంబర్28(విజయక్రాంతి):స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించి తీరుతుందని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో ఒక విధంగా లాభం జరుగుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మేలు జరిగేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి మోసకాకుండా ప్రజల నెత్తిపై మోయలేనంత అప్పుల భారం మోపిందని విమర్శించారు.

2014 లో బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో ఆటు పోట్లు ఎదురుకొన్నామని ఆనాటి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అరెస్టులు నిర్బంధాలను ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీని కరీంనగర్ లో పార్టీ బలోపేతం కోసం కృషి చేశామనీ 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నో ప్రలోభాల మధ్య కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేశారని ఆర్టిసి సమ్మెలో కార్మికులకు మద్దతుగా పోరాటం చేశానని నరేందర్ రెడ్డి గుర్తు చేశారు.

నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా ఒకవైపు నియంతృత్వ బిఆర్‌ఎస్ పార్టీకి మతతత్వ బిజెపి పార్టీకి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతూనే పార్టీని బలోపేతం చేశామని నరేందర్ రెడ్డి అన్నారు.

ఆనాడు మేము ధర్నా చేసి ఆనాటి ప్రభుత్వం తీసుకపోయినా పరిష్కారం కాని సమస్యలను ఇప్పుడు మేము పరిష్కరిస్తున్నామని సు డా చైర్మన్ గా కరీంనగర్ నియోజకవర్గంతో పాటు సుడా పరిధిలో ఉన్న అన్ని నియోజక వర్గాలకు నిధులు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఇప్పటికే పది హేను కోట్ల రూపాయలు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టామని రాబోయే రోజుల్లో మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు ఎమ్మెల్యేల సహకారంతో కరీంనగర్ లో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టిన పెండింగు పనులన్నీ మరియు పలు కూడళ్లు సుందరీకరణ చేస్తామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ విలేఖరుల సమావేశంలో ఎండి తాజ్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,జిడి రమేష్,దండి రవీందర్,అనిల్ కుమార్,కుర్ర పోచయ్య,పెద్దిగారి తిరుపతి,షభానా మహమ్మద్,ముల్కల కవిత,ఊరడి లత,అస్తపురం తిరుమల,తోట అంజన్న,లింగ మూర్తి, బషీర్,జ్యోతి రెడ్డి, రాజ్కుమార్,వెంకట్ రెడ్డి,పర్వతం మల్లేశం,ఆంజనేయులు,ఖలీల్ తదితరులుపాల్గొన్నారు.