29-09-2025 12:00:00 AM
ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు
ఘట్ కేసర్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని మర్పల్లిగూడ, మాదారం లలో ఆదివారం గ్రామ నాభిశిల బొడ్రాయి పండగ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. బ్రాహ్మనోత్రముల మంత్రో చరణాల మధ్య అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరిగిన ఈమహోత్సవంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బొడ్రాయి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
ఈమహోత్సవంలో పాల్గొన్న భక్తజనులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బొడ్రాయి ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను చేశారు. ఈసందర్భంగా కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపాల సుధాకర్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు రమేష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్యానాయక్, మాజీ సర్పంచ్ నల్లోల యాదగిరి, మాజీ ఉపసర్పంచ్ నల్లోల రవికుమార్, రైతు సొసైటీ డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, నాయకులు బొక్క విష్ణువర్ధన్ రెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, చిలుగూరి మంకయ్య, బద్దం జగన్ రెడ్డి, బొడిగె శ్రీనివాస్ గౌడ్, బొక్క కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.