calender_icon.png 14 February, 2026 | 6:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి బ్రహ్మరథం

14-02-2026 01:43:07 AM

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

ప్రజలు విశ్వాసంతో మా పార్టీకి ఓటు వేశారు

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 

హైదరాబాద్/నిజామబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఘన విజయం అందజేసి ‘ప్రజా పాలన’ ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజలు తమ మద్దతును స్పష్టంగా వెల్లడించారని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారదర్శక పాలన అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు విశ్వాసంతో కాంగ్రెస్‌కు ఓటు వేశారన్నారు. సామాన్యుల సంక్షేమం, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని చెప్పారు. వరుస విజయాలతో పార్టీపై రాష్ట్ర అభివృద్ధి బాధ్యత మరింత పెరిగిందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రజలు వాటిని నమ్మకుండా అభివద్ధి, సంక్షేమానికి ఓటు వేశారని అన్నారు. 

మత విద్వేషాలు రెచ్చగొట్టారు

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి ప్రజ లు మద్దతు తెలిపారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపల్, కార్పొరేషన్లలో 75 శాతం మేరకు కాంగ్రెస్ పార్టీ గె లుపు సాధించిందన్నారు. సీఎంతో పాటు తాను రాష్ట్ర మంత్రులు అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుడు తున్నామని వచ్చే మూడేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టారని తాము 18 నుంచి 20 సీట్ల వరకు గెలు స్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. నిజాంబాద్ నగరంలోని ఎంఐఎం ఇలాకాలో కూడా కాంగ్రెస్ పార్టీ స్థానాలు దక్కించుకుందని కార్పొరేషన్ లలో పార్టీలలో అలయన్స్ తో చైర్మన్ మేయర్ స్థానాలు దక్కించుకోవడానికి ముఖ్యమంత్రి సమక్షంలో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.మున్సిపాలిటీ , కార్పొరేషన్లలో అధిక మొత్తంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిం చినందుకు తెలంగాణ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ తెలంగాణ ప్రజలు పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి పట్నం కట్టారన్నారు.