calender_icon.png 12 November, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులతో హమాలీ పని!

12-11-2025 12:00:00 AM

  1. పాఠ్యపుస్తకాలను తరలిస్తుండగా ఆటో బోల్తా
  2. నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
  3. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘటన

నాగర్‌కర్నూల్, నవంబర్ 11 (విజయ్ర కాంతి): నాగర్‌కర్నూలు జిల్లా సాతాపూర్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులను పాఠ్యపుస్తకాలు తరలించడం కోసం హమాలీలుగా వినియో గించుకున్నారు. ఆటోలో తరలిస్తున్న క్రమం లో ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో నలు గురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జడ్పీ హెచ్‌ఎస్‌కు పార్ట్ పాఠ్యపుస్తకాలను ఆటో లో తరలించేందుకు 9వ తరగతి చదు వుతున్న విద్యార్థులను తీసుకెళ్లారు.

బరు వైన పుస్తకాలను ఆటోలో ఎక్కించారు. ఆటో లో సాతాపూర్ గ్రామ సమీపంలోకి రాగానే ప్ర మాదవశాత్తు టైరు పేలి బోల్తా కొట్టింది. దీం తో విద్యార్థులు కార్తీక్, అశోక్, నాని, శివలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో శివ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వై ద్యులు తెలిపారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్‌ను వివరణ కోరగా.. తనకు ఎలాంటి సం బంధం లేదన్నట్లుగా సమాధానం ఇచ్చా రని తెలిసింది. దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.