20 August, 2026 | 5:56 AM

కుటుకనూరులో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన

20-08-2026 12:00 AM

అయిజ, ఆగస్టు 19: అయిజ మండలం కుటుకనూరు గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడిని శాలువాలతో సత్కరించారు. మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.