సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి
నాగోల్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ డీసీపీ నాగలక్ష్మి సూచించారు. సైబర్ జాగరూకత దివస్ సందర్భంగా నాగోల్ పోలీస్ స్టేషన్లో సీనియర్ సిటిజన్లకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సం దర్భంగా డిజిటల్ అరెస్ట్ మోసాలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓఎల్‌ఎక్స్, ఆన్లైన్ షా పింగ్, కస్టమర్ కేర్, రుణాలు, మ్యాట్రిమోనియల్ మోసాలతో పాటు ఓటీపీయూపీఐ మోసాలు, ఫిషింగ్, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
అపరిచిత వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, యూపీఐ పిన్ను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. ఇంటర్నెట్ను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ అనుమానాస్పద లావాదేవీలు, సందేశాల పట్ల అ ప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శివశంకర్ గౌడ్, నాగోల్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, ఎస్‌ఐలు పి. శివ నాగ ప్రసాద్, మమతారెడ్డి పాల్గొన్నారు.






