calender_icon.png 20 December, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మూర్ నియోజకవర్గంలో అత్యధికంగా సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ కైవసం

20-12-2025 01:17:23 AM

ఆర్మూర్, డిసెంబర్19 (విజయ క్రాంతి): మూడో విడత స్థానిక సంస్థ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలను అత్యధికంగా కైవసం చేసుకున్నది అని, నియోజకవర్గం లో మొత్తం సర్పంచ్ స్థానాలు 86 ఉండగా కాంగ్రెస్ పార్టీ 60 సీట్లు,బి జె పి 12సీట్లు,బి ఆర్ ఎస్ 7 సీట్లు, స్వతంత్రులు 7 స్థానాలు గెలుచుకున్నట్లు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను తెలుసుకున్న నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచ్ గా అత్యధిక స్థానాల్లో గెలిపించారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.    రాబోయే ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో భారీగా కాంగ్రెస్ పార్టీ సీట్లను చేసుకుంటామని వినయ్ కుమార్ రెడ్డి భీమా వ్యక్తం చేశారు.