ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేసేందుకు కుట్ర
భైంసా,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు ప్రాథమిక విద్యను నిర్మించడం హేతుబద్ధీకరణకు జారీచేసిన జీవో 25న వెంటనే రద్దు చేయాలని తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు శశికాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఈ జీవో వల్ల రాష్ట్రంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆత్మకూరు దెబ్బతింటుందన్నారు.
ఇటీవల కాలంలో విద్యావ్యవస్థ లో సంస్కరణల పేరిట ప్రభుత్వం తీసుకు వస్తున్న కొన్ని చట్టాలు, ఉత్తర్వులు విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం మాట అటుంచి గందరగోళాన్ని సృష్టించే విధంగా కొనసాగుతోందని, జీవో.25 పేరుతో ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ వందలాది ప్రాథమిక పాఠశాలను పూర్తిస్థాయిలో మూసివేసేదిశగా కన్పిస్తుందని, పేర్కొన్నారు ప్రభుత్వం దీన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి.రాజేశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రప్రకాష్ జైస్వాల్, ధీరజ్, షిండే దత్తూరామ్ లు పాల్గొన్నారు.




