14-02-2026 12:44:40 AM
ఎదురుగా కానిస్టేబుల్ బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం
మృతుని కుటుంబానికి రూ. 10 లక్షలు ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ టౌన్, ఫిబ్రవరి 13: నల్లగొండ మండలంలోని చందనపల్లి గ్రామ శివారులో నకిరేకల్ కు వెళ్తున్న కానిస్టేబుల్ బైకును డీసీఎం ఢీకొట్టడంతో శుక్రవారం స్పాట్లోనే మృతి చెందాడు మునుగోడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తయ్యబ్(34) నల్గొండలో ఎన్నికల కౌంటింగ్ వద్ద విధులు నిర్వహించారు.
తిరిగి స్వగ్రామానికి నకిరేకల్ కు బైక్ పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన డీసీఎం, కానిస్టేబుల్ షేక్ తయ్యుబ్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు డీసీఎం డ్రైవర్ అజాత జాగ్రత్తగా వాహనం నడిపి ఎదురుగా వస్తున్న కానిస్టేబుల్ ని ఢీకొట్టడం వలన ప్రమాదం జరిగిందని స్థానికులు చె బుతున్నారు. మృతుడుకు ఇద్దరు చిన్న పిల్ల లు ఉన్నారు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
మృతుని కుటుంబానికి 10 లక్షల ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి
మునుగోడు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్ తయ్యబ్ కుటుంబానికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి 10 లక్షలు ప్రకటించారు రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందడం ఎంతో బాధ అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు.