calender_icon.png 14 February, 2026 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివపూజకు వేళాయే..

14-02-2026 12:43:33 AM

  1. మహా శివరాత్రి వేడుకలకు శైవ క్షేత్రాలు ముస్తాబు

అభిషేకాలు, జాగరణ, ఉపవాస దీక్షలకు ప్రాధాన్యత 

శివనామస్మరణతో మార్మోగనున్న ఆల యాలు

భక్తుల జాగరణకు ఏర్పాట్లు

అధికారులు, ఆలయ కమిటీల ఆధ్వర్యం లో ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు

మణుగూరు, ఫిబ్రవరి 13(విజయక్రాంతి): ప్రతి ఇల్లూ శుద్ధిగా కనిపించే పవిత్ర మైన రోజు.. ప్రతి హృదీ లయకారుడి నామాన్ని జపించే దివ్యమైన దినం.. దీక్షగాఉపవాసం చేపట్టి భక్తిభావాన్ని చాటే పండుగ రోజు.. లింగోద్భవన ఘట్టాన్ని కనులారా వీక్షిస్తూ తన్మయత్వం పొందే అద్భుత మైన వేడుక.. నిష్టతో నిశీపూజలు చేసి ఆ బోలాశంకరుడి కటాక్షాన్ని పొందాలని భా వించే భక్తలోకం ఒళ్లన్నీ కళ్లు చేసుకొని ఎదురు చూస్తున్న ముక్కంటి ఉద్భవించిన ఉత్సవం..

అదే మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి వేడుకకు ఉమ్మడి జిల్లాలోని శైవాలయాలు ముస్తాబయ్యాయి. విద్యుద్దీపాల కాంతులతో ఆలయ గోపురాలు, ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. పండుగ శోభను సంతరించుకున్న దేవాలయాలు శివనామస్మరణ చేస్తున్నా యి. ఆదివారం మహా శివరాత్రి పర్వదినం కావడంతో ఆలయా ల్లో ప్రత్యేక పూజలు నిర్వహిం చేందుకు ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలపై విజయక్రాంతి కథనం..

శైవ క్షేత్రాలు ముస్తాబు...

ఉమ్మడి జిల్లా కూసుమంచి లోని కాకతీ యుల కాలం నాటి పురాతన శివాలయం, తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయం, పెనుబల్లి మండలం భవన్న పాలెంలోని నీలా ద్రీశ్వరుడి ఆలయం, వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం రామలిం గేశ్వరస్వామి దేవాలయం, మోతే పట్టీ నగర్లోని భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం, మధిరలోని మున్నేరు నది ఒడ్డున ఉన్న శ్రీమృ త్యుం జయస్వా మి ఆలయం,

ఖమ్మం కాల్వొడ్డు లోని గుంటుమల్లేశ్వరస్వామి ఆలయం, అన్న పురెడ్డిపల్లిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం, జూలూరుపాడు మండలం పాపకొల్లులోని కాకతీయుల కాలంనాటి ఉమా సోమలింగేశ్వర స్వామి, మణుగూరు లోని పురాతన నీలకంఠేశ్వర స్వామి ఆలయాలు శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి.

భక్తుల కోసం ముమ్మర ఏర్పాట్లు..

శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయాలను ఆకర్షణీయంగా అలంకరించారు. శైవ క్షేత్రాలన్ని శివనామస్మరణతో మారు మోగనున్నాయి. ప్రతి సంవత్సరం మాఘ మాసంలో బహుళ చతుర్దశి రోజు పర్వది నాన్ని జరుపుకుంటారు. శివారాధన లింగ రూపంలో చేస్తారు. ప్రతి లింగంలోనూ శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుందని భక్తుల నమ్మకం. ద్వాదశ జ్యోతిర్లింగాలు ప్రధానమైనవి. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి అభిషేకాల్లో పాల్గొం టారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భజనలతో శివనామంతో మారుమోగు తుంది. లింగాష్టకం, శివపంచాక్షరి 

జపిస్తారు. శివుడు అభిషేక ప్రియుడు కావడంతో రుద్రాభిషేకాలు కూడా చేస్తారు. రోజంతా పరమేశ్వరుడిని ప్రార్ధించి రాత్రి జాగారం చేస్తారు. శివుడు తాండవం చేసిన రోజుగా చెబుతారు. మణుగూరు లోని పురాతన నీలకంటేశ్వర ఆలయం, గోదావరి తీరాన శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనా థేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భం గా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభి షేకం, స్వామివారికి, అమ్మవారికి కల్యా ణోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు 

తెలిపారు. పినపాక మండలం చింతల బయ్యారం, సీతంపేట ఆలయాలలో శివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, బిల్వార్చనలు, కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వాహకులు తెలిపారు. నీలకంఠేశ్వర, వైద్యనాథేశ్వర ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న, చిత్ర పటాలు, మిఠాయిలు, తదితరాలు విక్రయించే స్టాళ్ల ఏర్పాటు, భక్తుల వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ఆలయాల వెలుపల ఉన్న ఖాళీ స్థలాన్ని యంత్రాలతో చదును చేస్తు న్నారు. షామియానాలు, క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈఓ చెప్పారు. అలాగే గోదావరి తీరంలో పుణ్య స్థానాలు ఆచరించే భక్తుల కోసం ఏర్పాటు చేశామన్నారు. 

మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు, జల్లు, స్నానాలు, తదితర అన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.రుద్ర హోమం, ఎదురుకోలోత్సవం, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామి వారి దివ్య కల్యాణం జరుగుతాయని వివరించారు.

శివరాత్రి ఉత్సవాల సమయంలో పుణ్య కృష్ణానదిలో స్నానం ఆచరించి స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్య లో భక్తులు వస్తుంటారు. ఎంతో పవిత్రమైన ఈ దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తుం టారు.శివరాత్రికి ఒక్కరోజే వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి కల్యాణాన్ని తిలకిస్తారు.

శివనామస్మరణతో మార్మోగనున్న ఆలయాలు..

ఆయా ఆలయాలకు శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరా నుండగా, అధికారులు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆయా చోట్ల ఎలాంటి ఇబ్బందులు తలె త్త కుండా సేవలందించేందుకు స్వచ్ఛంద సం స్థలు ముందుకు వచ్చాయి. శివకల్యా ణంతో పాటు ఇతర పూజలు జరుగనుం డగా, శివనామస్మరణతో ప్రాంగణాలు మార్మోగ నున్నాయి.