17-02-2026 12:20:48 AM
పెబ్బేరు పిబ్రవరి 16: పెబ్బేరు మున్సిపాలిటీ కేంద్రంలో మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్ శివాని ఓ చిన్న మానవత్వ క్షణం అందరి హృదయాలను తాకింది. మున్సిపాలిటీ కేం ద్రంలో 5 వార్డు కౌన్సిలర్గా ఎన్నికైన భాగ్యలక్ష్మి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేళ, అ క్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ శివాని చూపిన సేవా భావం అందరినీ ఆకట్టుకుంది. ప్రమాణస్వీకారానికి వచ్చిన ఒక చిన్నారి తన తల్లితో కలిసి కార్యక్రమానికి హాజరైంది.
సభలో జనసమ్మర్థం, కోలాహలం మధ్య చిన్నారి అసౌకర్యంగా ఉండటాన్ని గమనించిన కానిస్టేబుల్ శివాని, విధుల్లో ఉన్నప్పటికీ మానవత్వాన్ని ముందుకు తెచ్చారు. ఆ చిన్నారిని ఆ ప్యాయంగా ఆలింగనం చేసి, కొద్దిసేపు ఆదరిస్తూ తల్లికి సహాయం చేశారు. ఈ దృశ్యం అక్కడు న్న వారిని కదిలించింది. పోలీసు విధుల్లో కఠినత్వం మాత్రమే కాకుండా, మానవత్వం కూడా ఉంటుందనే విషయాన్ని శివాని తన చర్యతో చాటిచెప్పారు. ప్రజల భద్రతే కాకుండా, వారి భావోద్వేగాలకు కూడా అండగా నిలబడగలమని నిరూపించారు.