calender_icon.png 18 February, 2026 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్’కు విశేష స్పందన

17-02-2026 12:20:21 AM

ఐఐఎంసీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహణ

పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి నగదు బహుమతులు అందజేత

హైదరాబాద్(ఖైరతాబాద్), ఫిబ్రవరి16(విజయక్రాంతి): ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కళాశాల (స్వయం ప్రతిపత్తి), ప్లానెట్ ఫైనాన్స్ బిజినెస్ స్కూల్ సంయుక్తంగా సోమవారం బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్ ను అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహించాయి.

డిగ్రీ, పీజీ విద్యార్థుల్లో కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2026.-27 అంశాలపై అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ‘బడ్జెట్ నాలెడ్జ్ టెస్ట్’ను నిర్వహించారు. ఇందులో 11 దేశాల నుంచి,  భారత దేశంలోని 17 రాష్ట్రాలకు చెందిన179 నగరాల్లోని వివిధ కళాశాలలకు చెందిన 2,012 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కూర రఘువీర్ తెలిపారు. ఈ పరీక్షలో కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన వివిధ అంశాలపై100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇచ్చి 1గంట వ్యవధి ఇచ్చామన్నారు.

పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మరవేని సాయిరాజ్ (అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం, బెంగళూర్) మొదటి బహుమతిగా రూ. 5,000, మహమ్మద్ పైసల్ (అజ్మద్ అలీ ఖాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, హైదరాబాద్ ) రెండవ బహుమతిగా రూ. 3,000, డి. హేమ నాగ వర్ధిని (అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం, బెంగళూరు) మూడవ బహుమతిగా రూ. 2,000, దివ్య కృప, టి. వాగ్దేవి, ఎం నవ్యశ్రీ (అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం, బెంగళూరు), మాన్విత్యాగి (హెచ్‌ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఘజియాబాద్), కునాల్ కుమార్ (ఆదిత్య యూనివర్సిటీ, కాకినాడ),రితిక్ రస్తోగి (ఇంటిగ్రేటెడ్ అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, ఘజియాబాద్), హీనా కుమారి (సి బి బండారి జైన్ కాలేజ్, బెంగళూర్), ఎస్.అస్గర్ (శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్), విజయ్ మెహత్రే ( ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఖైరతాబాద్), ఎన్. చందేల్ (అలహాబాద్ విశ్వవిద్యాలయం, ప్రయాగ్రాజ్) లకు 10 ప్రోత్సాహక బహుమతులు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున అందజేశారు.