28 August, 2026 | 1:57 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

అక్రమాలపై విచారణ జరపాలి

20-06-2026 04:33 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ క్రికెట్ను కుదిపేస్తున్న సంచలన ఆరోపణలు, 18 క్లబ్ల విక్రయాలపై ఆరోపణలు హెచ్సీఏకు అనుబంధంగా ఉన్న 18 క్రికెట్ క్లబ్లను నిబంధనలకు విరుద్ధంగా AM ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసి భారీ స్థాయిలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని టీసీఏ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు ఆరోపించారు. క్రికెట్ అభివృద్ధి పేరుతో వ్యవస్థను కొందరు వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని విమర్శించారు.

టీజీ20 లీగ్ వివాదం, హెచ్సీఏలో అధికారికంగా అనుమతి లేని రెండో బ్యాంకు ఖాతాను తెరిచి, దాని ద్వారా టీజీ20 లీగ్ నిర్వహణకు సంబంధించిన నిధుల లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఖాతా ద్వారా జరిగిన లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని టీసీఏ కోరింది,

హెచ్సీఏలో చోటుచేసుకున్నట్లు ఆరోపిస్తున్న నిధుల మళ్లింపు, ఆర్థిక లావాదేవీలు, క్లబ్ల వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి, ఇందులో ఎవరి పాత్ర ఉందో వెలుగులోకి తీసుకురావాలని టీసీఏ లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తు అవసరమని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ 3 క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది అని టీసీఏ నిర్మల్ జిల్లా కోచ్ రామరాజు శనివారం పత్రిక ప్రకటన లో పేర్కొనారు