20 June, 2026 | 6:18 PM

మంథని కోర్టులో ఘనంగా యోగా దినోత్సవం, లోక్ అదాలత్

20-06-2026 05:12 PM

మంథని,(విజయక్రాంతి): మంథని కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు లోక్ అదాలత్ కార్యక్రమాలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంథని   జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి అర్ర సుధా రాణి మాట్లాడుతూ యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, అదేవిధంగా లోక్ అదాలత్ ద్వారా కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలకు సమయం, ధనం ఆదా అవుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.వి.ఎల్.ఎన్. హరి బాబు, ఏపీపీ అర్థ కుమార్, మంథని సీఐ బుధే స్వామి, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీమతి అనురాధ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు న్యాయవాదులు రాఘోత్తం రెడ్డి, సువర్ణ చంద్ర శేఖర్, లోకే రాధా కిషన్, కటుకం శ్రీనివాస్, డి. విజయ్ కుమార్, యు. సుభాష్, శశిభూషణ్ కచ్చే, షబానా  తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.