యోగాతో మానసిక ఒత్తిడి దూరం
బిజినేపల్లి: ప్రతి వ్యక్తి ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి యోగాను అలవాటు చేసుకోవాలని, తద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని ప్రభుత్వ ఆయూష్ యోగా శిక్షకుడు ఎన్. శివప్రసాద్ అన్నారు. శనివారం పాలెం వ్యవసాయ కళాశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆయూష్ యోగా శిక్షకుడు ఎన్. శివప్రసాద్, అసోసియేట్ డీన్ డా. వి. హేమలతలు మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
కార్యక్రమంలో యోగా నిపుణులు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ సాధనలు, సూర్య నమస్కారాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో విద్యార్థి వ్యవహారాల ఇన్‌చార్జి అధికారి డా. వి. స్వర్ణలత, కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.ఓ. శైల, ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారి వి. శ్రీరమ్య, ఇతర బోధనా అధ్యాపకులు, విద్యార్థులు మరియు బోధనేతర సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






