నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణా
- తరగతులను జయప్రదం చేయాలి
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), ఏప్రిల్ 1: సూర్యాపేట జిల్లా అర్వపల్లిలోని మల్లు స్వరాజ్యం స్మారక భవన్లో ఈనెల 8,9 తేదీలలో జరిగే సీపీఎం పార్టీ తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు పిలుపునిచ్చారు.బుధవారం మండల కేంద్రం అర్వపల్లిలోని మల్లు స్వరాజ్యం స్మారక భవన్లో జరిగిన సీపీఎం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు చెరుకు ఏకలక్ష్మి,మట్టిపెల్లి సైదులు,జిల్లా కమిటీ సభ్యుడు పులుసు సత్యం,జాజిరెడ్డిగూడెం,నాగారం మండలాల కార్యదర్శులు వజ్జె శ్రీనివాస్,దేవరకొండ యాదగిరి,మండల కమిటీ సభ్యులు బూర్గుల ప్రభాకర్,శిగ వెంకన్న,కొమ్ము విజయ్ తదితరులు పాల్గొన్నారు.




