13 June, 2026 | 9:37 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం   •   భారీ వర్షానికి తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి   •   ప్రభుత్వ పాఠశాలలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు తక్షణమే సరఫరా చేయాలి   •   బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా గొల్ల ప్రభు   •   జిల్లా పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక   •   తెలంగాణకు బీజేపీ 12 ఏళ్ల పాలనలో ఒక్క ప్రధాన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదు   •   జాతీయ సెమినార్ లో కోయగూడెం వాసికి సన్మానం   •   మైనర్ బాలికపై దాడి ఘటనను ఖండిస్తూ అశ్వాపురంలో భారీ నిరసన ర్యాలీ   •   అభివృద్ధిని అడ్డుకునే విమర్శలు మానుకుని సహకరించాలి   •   కల్లూరులో మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం   •  

వీర వనిత అనసూయమ్మ జీవితం

02-04-2026 12:02 AM
  1. నేటి సమాజానికి ఆదర్శనీయం

వెలిదండలో జరిగే అనసూయమ్మ వర్ధంతి సభను జయప్రదం చేయండి

సీపీఎం నాయకుడు పారేపల్లి శేఖర్ రావు

గరిడేపల్లి, ఏప్రిల్ 1 : కామ్రేడ్ వీరవనిత మేదరమెట్ల అనసూయమ్మ జీవితం నేటి సమాజానికి ఆదర్శనీయమని సిపిఎం నాయకుడు పారేపల్లి శేఖర్ రావు అన్నారు. బుధవారం మండలంలోని వెలిదండ గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తుమ్మల సైదయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం భర్త మేదరమెట్ల సీతారామయ్య అడుగుజాడల్లో నడుస్తూ తన పోరాటపటిమని చాటిన వీర వనిత అనసూయమ్మ జీవితం చిరస్మరణీయమని అన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీర వనిత మేదరమెట్ల అనసూయమ్మ  జీవితం అందించిన పోరాట స్ఫూర్తిని మనమంతా భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈనెల నాలుగో తారీఖున వెలిదండ లో జరిగే వర్ధంతి కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షేక్ యాకోబ్,దోసపాటి భిక్షం ,బొల్లెపల్లి శ్రీనివాస్, ఏనాల సోమయ్య, బోయిళ్ళ అర్జున్, దోసపాటి సుధాకర్, యామగాని వెంకటేశ్వర్లు, నందిపాటి మట్టయ్య,యానాల బిక్షమయ్య, సారెడ్డి సైదిరెడ్డి,సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు