26 May, 2026 | 2:46 AM

సంఘ బంధం భవనం ప్రారంభం

26-05-2026 01:40 AM

గరిడేపల్లి, మే 25: మండలంలోని పరెడ్డిగూడెం గ్రామంలో సోమవారం సంఘ బంధం ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం నిధులు రూ.10 లక్షలతో నూతన భవనాన్ని నిర్మించారు. సంఘబంధం పరిధిలోని సమభావన సంఘాలకు చెందిన మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతుండగా, కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకం ద్వారా ఈ భవనాలను నిర్మించింది.

దీంతో సమ భావన సంఘం మహిళలు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు తొలగిపోయినట్టే. సలహాన సంఘాల మహిళలకు ఈ నూతన భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ, మాజీ ఎంపీపీ పైడిమర్రి రంగనాథ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురం అంజన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కేతేపల్లి నరసయ్య,మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు మేగల మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రేణుక, సీసీ సైదులు, వివో ఏ ల అధ్యక్షురాలు పత్తిపాటి రేణుక, వివో ఏ కందల వెంకన్న, మహిళా సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.