26 May, 2026 | 2:47 AM

స్నేహితుడి కుటుంబానికి చేయూత

26-05-2026 01:40 AM

కేసముద్రం, మే 25 (విజయక్రాంతి): చిన్న వయసులోనే అకాల మృత్యువాత పడ్డ స్నేహితుడి కుటుంబానికి చిన్నతనం నుండి కలిసి చదువుకున్న క్లాస్మేట్స్ అండగా నిలిచారు. కేసముద్రం హై స్కూల్ 1993 94 టెన్త్ బ్యాచ్ కు చెందిన ఇనుముల కరుణాకర్ ఇటీవల అనారోగ్యంతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న క్లాస్మేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 80 వేల రూపాయలను కరుణాకర్ కుమార్తె రక్షిత పేరు మీద బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఆ పత్రాలను సోమవారం అందజేశారు.

అకాల మృత్యువాత పడ్డ మిత్రుడి కూతురి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు స్నేహితులు ముందుకు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ కార్యక్రమంలో క్లాస్మేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.