హత్నూరలో మురుగు కాలువల నిర్మాణం
01-04-2026 12:01 AM
జహీరాబాద్, మార్చి 31: జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్ మండలం హత్నూర గ్రామంలో ఆర్‌అండ్ బి రోడ్డు ప్రక్కన మురుగు కాలువల నిర్మాణం ప్రారంభించారు. ఐదు లక్షల ఎంపీ నిధుల ద్వారా పనులు ప్రారంభించారు. న్యాల్కల్ మండ లం తాజా మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పనులు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా గౌసద్దీన్ మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ తమ గ్రామానికి 5 లక్షల నిధులను మురుగు కాలువలు నిర్మించేందుకు మంజూరు చేశారని తెలిపారు.




