07-05-2025 09:28:26 AM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయ క్రాంతి): వర్షపు నీటిని వృధా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలను రీఛార్జ్ చేయాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రతి పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మించాలని సూచించారు. ఈ మేరకు కొత్తగూడెం మండలంలోనీ అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయినట్లు ఎంఈఓ డాక్టర్ ప్రభుదయాల్ తెలిపారు. మండలంలో రామవరం, కూలీలైన్, ఆనందఖని ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని,6 నుండి 9 తరగతుల విద్యార్థినీ, విద్యార్థులు ఈ శిబిరాల్లో పాల్గొంటూ వేసవి సెలవుల్ని అర్థవంతంగా, ఆహ్లాదకరంగా వినియోగించుకోవాలని కోరారు. బుధవారం పాఠశాలలకు గ్రీన్ బోర్డులు సరఫరా కానున్నట్లు ఎంఈఓ తెలిపారు.