22-05-2025 03:14:36 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో( Telangana state) పోలీస్ అధికారుల బదిలీలు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం గురువారం 30 మంది అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (నాన్-కేడర్) అధికారులను బదిలీ(Police officers Transfers) చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చింది. మూడు రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేసిన ప్రభుత్వం తాజాగా 30 మంది ఏఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన ఏఎస్పీలు వీళ్లే.. బి. కిషన్ (అడ్ల్ ఎస్పీ - ఆపరేషన్స్ అండ్ క్రైమ్స్ వరంగల్), ఎ నరేష్ కుమార్ (అడ్ల్ ఎస్పీ - అడ్మిన్, భూపపల్లి), ఎస్ జయరామ్ (అడ్ల్ ఎస్పీ - టిజిఐసిసిసి), గొల్ల రమేష్ (అడ్ల్ ఎస్పీ - నల్గొండ అడ్మిన్), ఎ లక్ష్మి (అడ్ల్ డీసీపీ ట్రాఫిక్, ఎల్. బి నగర్), వి రఘు (అడ్ల్ ఎస్పీ, ఇంటెలిజెన్స్), టి గోవర్ధన్ (అడ్ల్ డీసీపీ ఎల్ అండ్ ఓ, వరంగల్), కె పూర్ణచందర్ (అడ్ల్ డీసీపీ, శంషాబాద్), ఎం సుదర్శన్ (అడ్ల్ డీసీపీ సిసిఎస్ హైదరాబాద్) మరియు ఎన్ శ్యామ్ ప్రసాద్ రావు (అడ్ల్ ఎస్పీ సిఐడి) వంటి అధికారులు ఉన్నారు.