ముమ్మరంగా కొనసాగుతున్న లక్ష్మీ గణపతి దేవాలయ నిర్మాణ పనులు
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మున్సిపల్(Toopran Municipality) కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం(Subhash Chandra Bose Statue) వద్ద శ్రీ శ్రీ లక్ష్మీ గణపతి నూతన దేవాలయ(Sri Sri Lakshmi Ganapathi Temple) పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని వాణిజ్య, వ్యాపార, వర్తక సంఘలవారు, పార్టీల కతీతంగా ప్రజా ప్రతినిధులు, ప్రతి ఒక్కరు లక్ష్మీ గణపతి దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయంతో పాటు పలు రకాల సహకారాన్ని అందించాలని కోరారు. ప్రతి ఒక్కరు దేవాలయ నిర్మాణంలో పాలి భాగస్తులు కావాలన్నారు, మీరిచ్చే ఆర్థిక సహాయం దేవాలయ నిర్మాణ పనులకు దోహద పడుతుందన్నారు, సూర్యచంద్ర వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శ్రీరాములు, ఎక్కల్ దేవ్ వెంకటేష్ యాదవ్, ఓం ప్రకాష్, లడ్డు, కిరణ్ లు ఉన్నారు.






