13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

రాజంపేటలో సీసీ రోడ్ల నిర్మాణ పనుల ప్రారంభం

30-03-2026 09:32 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలం రాజంపేట గ్రామపంచాయతీలో  ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకం కింద మంజూరైన నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను సోమవారం సర్పంచ్ బుర్సా పోచయ్య,  మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల మంగ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో మూడు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా వాటి మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.20 లక్షలుగా ఉందని తెలిపారు.

గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, గ్రామాభివృద్ధిని వేగవంతం చేయడం  ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఉప సర్పంచ్ మామిడి లక్ష్మి, వార్డు సభ్యులు గులాం జావీద్, బొట్టుపల్లి లావణ్య ప్రశాంత్, జాబరీ కిషోర్, కొమరం వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మారుతి తదితరులు పాల్గొన్నారు.