30 March, 2026 | 11:09 PM

రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతి

30-03-2026 09:34 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచెర్ల క్రాస్ రోడ్ సమీపంలోని తులిప్స్ హోటల్ దగ్గర  29వ తేదీ నాడు ఉదయం సుమారుగా  5-6 గంటల ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వాహనం రోడ్డు దాటుతున్న యాచకురాలిని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినది. ఇది గమనించిన కొంతమంది వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించి, కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నామని మేడిపల్లి సిఐ శంకరయ్య తెలిపారు.