16 April, 2026 | 4:02 PM

నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

25-11-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, నవంబర్ 24 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. అనంతరం కాలేజ్ రోడ్డులో కొనసాగుతున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రభుత్వం వైద్యరంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ క్రమంలో జిల్లా కేం ద్రంలో చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు, గుత్తేదారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.